Close

    తెలంగాణ రాష్ట్ర హైకోర్టు – డిజిటల్ డిస్ప్లే బోర్డులు

    నవంబర్ 20, 2015న, అన్ని కోర్ట్ హాల్స్‌లో మరియు బార్ అసోసియేషన్‌, గవర్నమెంట్ ప్లీడర్ కార్యాలయ భవనము, అడ్వకేట్స్ లైబ్రరీ మరియు అడ్వకేట్ క్యాంటీన్ వంటి ప్రస్ఫుటమైన ప్రదేశాలలో డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ డిజిటల్ బోర్డ్‌లు అన్ని కోర్టు హాళ్లలో కేసు విచారణ స్థితిని ప్రదర్శిస్తాయి మరియు నోటిఫికేషన్ బార్ ద్వారా ఇతర ముఖ్యమైన సందేశాలను ప్రసారం చేస్తాయి. న్యాయవాదులు మరియు లిటిగంట్స్ ప్రయోజనం కోసం హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో మరియు మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్‌లలో కూడా డిజిటల్ డిస్‌ప్లే బోర్డు ఆన్‌లైన్‌లో హోస్ట్ చేయబడింది. డిస్ప్లే బోర్డులు కోర్టు హాల్స్ లోపల మరియు వెలుపల కూడా ఉన్నాయి.