Close

    ఎన్.స్టెప్

    సాంప్రదాయ పద్ధతులలో సమన్లు మరియు ప్రొసెసులు అందచేయుటలో, తరచుగా సత్వర కేసుల పరిష్కారములో అనివార్యమైన జాప్యము జరుగు చున్నది.ఎన్‌.స్టెప్ అనేది వెబ్ అప్లికేషన్ మరియు ప్రక్రియను క్రమబద్ధీకరించుటకు రూపొందించిన పరిపూర్ణ మొబైల్ యాప్ తో కూడిన కేంద్రీకృత ప్రాసెస్ సర్వీస్ ట్రాకింగ్ అప్లికేషన్. బెయిలిఫ్స్(Bailiffs)లకు మరియు ప్రాసెస్ సర్వర్లకు సరియైన సమయంలో పారదర్శకంగా, నోటీసులు, సమన్ల యొక్క అందజేతను గుర్తించుటకు అనుమతిస్తుంది.సంబంధిత న్యాయస్థానములు స్వీకరించినట్లైతే, సి.ఐ.ఎస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఎన్‌.స్టెప్ అప్లికేషన్ లో, ఎలక్ట్రానిక్ ఆకృతిలో అందుబాటులోనికి వచ్చును.ఎన్‌.స్టెప్ వెబ్ అప్లికేషను, న్యాయస్థానము యొక్క అధికారిక పరిధిలో గల ప్రాసెస్లను, బెయిలిఫ్ లకు కెటయించడమే కాకుండా ప్రాసెస్ లను, అంతర్ జిల్లా లేక అంతర్ రాష్ట్ర సంబంధిత న్యాయస్థానము ఎస్టాబ్లిశ్మెంట్లకు కూడా కేటాయించవచ్చు.

    ఎన్‌.స్టెప్.,మొబైల్ యాప్ పై, కేటాయించబడిన ప్రాసెస్ లను బెయిలిఫ్లు వీక్షించవచ్చును. కోర్టు సర్వీస్ షెడ్యూల్ అనుసంధానించబడిన ఎండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు బెయిలిఫ్స్ లకు ఇవ్వబడినవి. బెయిలిఫ్లను జి.పి‌.ఎస్ తో ట్రాక్ చేయవచ్చు. గ్రహీత యొక్క సంతకము మరియు వెనువెంటనే అందచేతను అమలుకాకపోవుటకు కారణములు నమోదు చేయవచ్చును. సంగ్రహించిన సమగ్ర సమాచారమును కేంద్ర ఎన్‌.స్టెప్ అప్లికేషనుకు వెనువెంటనే తెలియచేయబడును. న్యాయస్థానములకు అందచేసిన యొక్క సమన్ల యొక్క పరిస్థితి తెలుసుకొనుటను వీలుకలిగించుటకు ఎన్‌.స్టెప్ వెబ్ అప్లికేషను నుండి సి.ఐ‌ఎస్.కు సమాచారము పంపబడుతుంది. ఎన్‌.స్టెప్ ఈ క్రింది ముఖ్య లక్ష్యాలను సాధించినది:-

    • ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసులు/సమన్లు నిర్వర్తించడం.
    • ప్రాసెస్ లు అందచేయటంలో అతి జాప్యమును, మారుమూల ప్రాంతముల నుండి వేగవంతమైన నమోదు, నవీకరణల వలన జాప్యము తగ్గించును.
    • ఎలక్ట్రానిక్ విధానంలో అందచేయుట వలన అంతర్ –జిల్లా లేక అంతర్ – జిల్లాలకు పోస్ట్ ద్వారా అందచేయుట వలన తీసుకొను సమయము కన్నా చాలాతక్కువ సమయము పట్టును.
    • కక్షిదారులకు అందజేయబడిన అన్ని సమన్లు మరియు ప్రాసెస్ ల యొక్క నిర్వహణ పారదర్శకంగా జరుగు అమలును కనిపెట్టవచ్చు.
    • భువన మ్యాపులతో జి.పి.ఎస్. అనుసంధానము(ఇస్రో అభివృద్ది పరచిన భారత భౌగోళిక వేదిక.)