Close

    ఐ.సి.జె.ఎస్

    జ్యూడిషియల్ డొమైన్ లో సమాచార సాంకేతిక పరిజ్ఞానము యొక్క ఉపయోగం, భారత న్యాయ వ్యవస్థలో అమలు కోసం జాతీయ విధానము మరియు కార్యాచరణ ప్రణాళిక ఇ-కమిటి, సర్వోన్నత న్యాయస్థానముచే రూపొందిచబడుటతో మొదలైనది.

    నేర న్యాయ వ్యవస్థ యొక్క అంతర్-కార్య నిర్వహణ అనునది (ఐ.సి.జె.ఎస్) ఇ- కమిటీ యొక్క చొరవ. నేర న్యాయ వ్యవస్థ యొక్క కోర్టులు, పోలీసులు, జైళ్లు మరియు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల, వంటి వివిధ వ్యవస్థల మధ్య డేటాను ఒకే వేదిక నుండి సజావుగా బదిలీ చేయుటకు వీలు కల్పిస్తుంది.

    ఐ.సి.జె.ఎస్. వేదిక సాయంతో, ఎఫ్‌.ఐ‌.ఆర్, చార్జిషీట్ యొక్క సమాచారమును అన్ని ఉన్నత న్యాయస్థానములు మరియు దిగువ న్యాయస్థానములు ద్వారా పొందవచ్చు.ఎఫ్‌.ఐ‌.ఆర్, కేసు డైరీ, చార్జి షీట్ వంటి పత్రాలను పోలీసులు పి.డి.ఎఫ్. ఫార్మాట్లో అప్లొడ్ చేస్తే, కోర్టులు వాటిని ఉపయోగించుకుంటాయి. సమాచార మార్పిడి కొరకు డేటా యొక్క ప్రామణికత, డేటా ధృవీకరణ , రసీదు,వినియోగదారుని గుర్తింపు/ ప్రాప్యత నిలువ కొరకు సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన మరియు ఎలక్ట్రానిక్ సంరక్షణ కొరకు ప్రక్రియలను చేయుటకు ఇ- కమిటీ చురుకుగా పని చేయుచున్నది.

    ప్రతి రాష్ట్రంలో ఐ.సి.జె.ఎస్. యొక్క సమర్ధవంతమైన అమలు నిర్ధారణ కొరకు, ఐ.పి.ఎస్. అధికారి స్థాయి సేవల వినియోగము కొరకు ఉన్నత న్యాయస్థానము లను కోరుట జరిగినది, వారు ఐ.సి.జె.ఎస్. వేదిక మీద సమాచార ఏకీకృతమునకు కీలక పాత్ర వహించేదరు. పోలీసులతో పాటు, ప్రావిడెంటు ఫండ్ సంస్థ, అటవీశాఖ, మున్సిపల్ శాఖ, కార్మిక సంక్షేమ బోర్డు, టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు ఆహారము మరియు ఔషద పాలన విభాగము కూడా, ఐ.సి.జె.ఎస్.లో భాగమని నిర్ధారించుటకు ఒక నోడల్ అధికారిని నియమించాలని హైకోర్టులను అభ్యర్ధించారు.

    వ్యాజ్యము మరియు న్యాయస్థానము నిర్వహణకు ఐ.సి.జె.ఎస్. వేదిక ఒక ప్రభావంతమైన సాధనము, ఎందుకంటే ఒక కేసు యొక్క అన్ని సంబంధిత సమాచారము న్యాయస్థానముల ఉపయోగం కోసం సరియైన సమయంలో అందుబాటులో ఉండును. న్యాయ ఉత్తర్వులు మరియు సమన్లు కూడా శీఘ్రముగా సాధించవచ్చును, సమర్ధవంతమైన సమయ నిర్వహణ నిర్ధారించును.నేర న్యాయ వ్యవస్థ యొక్క ఉత్పాదకతను గుణాత్మకంగా మరియు పరిమాణత్మకంగా పెంచడానికి ఐ.సి.జె.ఎస్. ఒక మైలు రాయిగా నిలుస్తుంది.