Close

    ముఖ్యమైన విజయాలు

    • ప్రపంచములోనే అతి పెద్ద ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ (ఫాస్-FOSS) ఆధారిత వేదిక ఫలితముగా దేశానికి 340 కోట్ల రూపాయలు (3400 మిలియన్లు) గణించబడిన లైసెన్సు ఫీజులు మరియు నిర్వహణ కొరకు పునరావృత వ్యయంతో కలుపుకోకుండా లెక్కించబడిన పొదుపు సమకూర్చబడింది.
    • దేశంలోని అన్ని జిల్లా మరియు క్రింది న్యాయస్థానముల కోసం సాధారణ వ్యాజ్యము నిర్వహణ మరియు వ్యాజ్య సమాచార వ్యవస్థ(సి.ఐ.ఎస్.) నేషనల్ కోర్ వర్షన్ 3.2(v 3.2) ఆవిష్కరించడం జరిగినది.
    • భారత దేశములోని 22 ఉన్నత న్యాయస్థానములలోను కేసు నిర్వహణ మరియు సమాచార వ్యవస్థ(సి.ఐ.ఎస్) నేషనల్ కోర్ వర్షన్ 1.0 అమలుచేయబడినది.
    • దేశవ్యాప్తంగా 3256 న్యాయస్థానముల సముదాయాల సమగ్ర సమాచారము ఇప్పుడు ఆన్ లైనులో అందుబాటులో ఉన్నది.
    • 688 జిల్లా న్యాయస్థానముల స్వంత వెబ్ సైట్లు స్థాపించబడ్డాయి.
    • జిల్లా మరియు తాలూకా న్యాయస్థానములకు సంభందించిన 13.60 కోట్లు (1360 మిలియన్లు) (పెండింగ్లో ఉన్న మరియు తీర్మానించబడిన) వ్యాజ్యముల యొక్క సమాచారం,నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ (ఎన్.జే.డి.జి.)లో పొందుపర్చడం జరిగినది.
    • ఉన్నత న్యాయస్థానములలో అపరిష్కృతంగా ఉన్న వ్యాజ్యముల యొక్క మొత్తం అనగా 3.38 కోట్ల (338 మిలియన్లు) మరియు 12.49 కోట్ల (1249 మిలియన్ల) ఆదేశాలు,తీర్పులు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నవి.
    • ఇ- కమిటీ అభివృద్ది చేసిన మొబైల్ యాప్ లను 4.54 మిలియన్ల ఎండ్రయాడ్ వినియోగదార్లు డౌన్ లోడ్ చేసుకొనినారు.