Close

    తెలంగాణ రాష్ట్ర హైకోర్టు – వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్

    హైకోర్టులోని గౌరవనీయులైన న్యాయమూర్తులందరూ క్రమ వ్యవధిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫుల్ కోర్టు సమావేశాలలో పాల్గొంటారు మరియు హైకోర్టు మరియు సబార్డినేట్ కోర్టులలోని పరిపాలనా సమస్యలను పర్యవేక్షిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ ద్వారా వర్చువల్ కోర్ట్ కేస్ హియరింగ్: తెలంగాణ హైకోర్టు సిస్కో వెబ్‌ఎక్స్ మీటింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని బెంచ్‌లను పనిచేసేలా చేసింది.సిస్కో వెబ్‌ఎక్స్ మీటింగ్ఐ డిలు ప్రతిరోజూ SMS ద్వారా న్యాయవాదులకు మరియు సంబంధిత వ్యక్తులకు పంపబడుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ నియంత్రించే సిబ్బంది కోసం న్యాయవాదుల మొబైల్ నంబర్‌లను పొందగలిగే విధంగా రోజువారీ కాజ్‌లిస్ట్ సర్దుబాటు చేయబడింది.