Close

  గౌరవ న్యాయమూర్తి. శ్రీయుత.శరద్ అరవింద్ బాబ్డె గారు, భారత ప్రధాన న్యాయమూర్తి.

  CJ
  • హోదా: ప్రధాన పరిపాలకులు

  గౌరవ న్యాయమూర్తి.శ్రీయుత.శరద్ అరవింద్ బాబ్డె గారు,నాగపూర్ విశ్వవిద్యాలయము నుండి బి.‌ఏ. మరియు ఎల్‌.ఎల్‌.బి పట్టబద్రులయ్యారు.1978 లో మహారాష్ట్రలోని బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా చేరారు. బొంబాయి ఉన్నత న్యాయస్థానములోను మరియు నాగపుర్ బెంచ్ ఉన్నత న్యాయస్థానము మరియు భారత సర్వోన్నత న్యాయస్థానము,21 సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు.

  • 29మార్చి 2000 అదనపు న్యాయమూర్తిగా న బొంబాయి ఉన్నత న్యాయస్థానమునకు పదోన్నతి పొందిరి.
  • మధ్యప్రదేశ్ రాష్ట్రము ఉన్నత న్యాయస్థానము ప్రధాన న్యాయమూర్తిగా, 16అక్టోబర్ 2012 న ప్రమాణ స్వీకారం చేశారు.
  • భారత సర్వోన్నత న్యాయస్థానమునకు న్యాయమూర్తిగా,12,ఏప్రిల్ 2013న పదోన్నతి పొందిరి.
  • భారత సర్వోన్నత న్యాయస్థానమునకు ప్రధాన న్యాయమూర్తిగా, 18,నవంబర్ 2019న ప్రమాణ స్వీకారం చేశారు.
  • 23 ఏప్రిల్,2021 న పదవీ విరమణ చేసెదరు.