Close

    తెలంగాణ రాష్ట్ర హైకోర్టు – ICJS (ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్)

    ICJS మరియు NSTEP అమలు విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక మార్గదర్శకంగాను మరియు ICJSలో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో పైలట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ప్రారంభించబడింది మరియు పరీక్ష విజయవంతంగా పూర్తయింది. డిసెంబర్ 15, 2018న గౌరవనీయులైన శ్రీ జస్టిస్ మదన్ బి లోకూర్,చైర్మన్ ఇంటర్‌ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) మరియు జడ్జి-ఇన్-ఛార్జ్ ఇ-కమిటీ, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గారిచె కోర్టులు మరియు పోలీసుల మధ్య డేటాను ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబడింది.