శ్రీ అతుల్ మధుకర్ కుర్హేకర్
నాగపూర్ నుండి సైన్స్ (బి.ఎస్.సి)లో డిగ్రీ పొందారు. నాగపూర్ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా నుండి ఎల్.ఎల్.బి డిగ్రీ పొందారు. ఉబుంటు మరియు సి.ఐ.ఎస్ కోసం సర్టిఫైడ్ మాస్టర్ ట్రైనరుగా డిగ్రీ పొందిరి. నాగపూర్ బెంచ్లొ, బొంబాయి ఉన్నత న్యాయస్థానములో మరియు నాగ్పుర్ జిల్లా న్యాయస్థానములలో సివిల్ మరియు క్రిమినల్ కేసులు ఎనిమిది సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిరి.
- అక్టోబర్ 1995 నుండి జనవరి 2004వరకు సివిల్ జడ్జ్- జూనియర్ డివిజన్ మరియు జె.ఎమ్.ఎఫ్.సి.గానూ,తదుపరి జనవరి 2004 నుండి డిప్యూటీ రిజిస్ట్రార్ గా నియమించబడే వరకు సీనియర్ సివిల్ జడ్జ్ గా నియమితులైనారు.
- లఘు వివాదాల న్యాయస్థానము(స్మాల్ కాసెస్ కోర్టు) ముంబాయి, నాగపూర్ బెంచ్ కి న్యాయమూర్తిగా నియమింపబడేవరకు సెప్టెంబర్, 2004 నుండి బొంబాయి ఉన్నత న్యాయస్థానములో డిప్యూటీ రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) గా పనిచేసిరి.
- మే,2008 నుండి మహారాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో నియామకం వరకు, దిగువ న్యాయస్థానములలో న్యాయమూర్తిగా నియమించబడిరి.
- పుణె అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా (జులై 2009-ఏప్రిల్ 2011) ఆపై పుణెలో న్యాయమూర్తిగా నియమించబడే వరకు మహారాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టరుగా (ఏప్రిల్,2011 –సెప్టెంబర్, 2013) పనిచేశారు.
- పూణే జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జిగా, సెప్టెంబర్ 2013 నుండి నవంబర్ 2014 వరకు, ఆపై అదనపు సెషన్స్ జడ్జ్ గా, నవంబర్ 2014 నుండి ముంబాయిలోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ న్యాయస్థానములో అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానములో రిజిస్ట్రారుగా నియమితులయ్యారు.
- మే ,2016 నుండి సభ్యుడు (ప్రక్రియలు),ఇ-కమిటీ నియామకం వరకు బొంబాయి ఉన్నత న్యాయస్థానము రిజిస్ట్రార్(లీగల్ అండ్ రీసెర్చ్) గా నియమితులయ్యారు.