Close

  ఇ-న్యాయస్థానముల సేవల చరవాణి అనువర్తనం (ఇ- కోర్టుల సేవల మొబైల్ యాప్)

  ECourts APP

  విప్లవాత్మక సమాచార సాధనముగా, ఇ-న్యాయస్థానము సేవల మొబైల్ యాప్ కు డిజిటల్ ఇండియా అవార్డ్ పొందింది. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ లో ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)ల సేవల మొబైల్ అప్ప్లికేషన్ అందుబాటులో ఉన్నాయి. కేసు స్థితి, కేసుల జాబితా, న్యాయస్థానముల ఆదేశాలు, ఈ మొబైల్ యాప్ ద్వారా పొందడమే కాకుండా, ఈ సేవలు 24X7 అందుబాటులో ఉంటాయి. ఇది న్యాయ వ్యవస్థలోని సభ్యులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు, ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర భాగస్వాములకు ఉపయోగకర సాధనము.సి.ఎన్.ఆర్.,అనునది జిల్లా లేక తాలూకా న్యాయస్థానములలో దాఖలు చేసిన ప్రతి వ్యాజ్యమునకు కేటాయించిన ప్రత్యేక సంఖ్య.పార్టీ పేరు, న్యాయ వాదుల పేర్లు, ఎఫ్.ఐ.ఆర్ నెంబరు, కేసు రకము లేదా సంబంధిత చట్టము వంటి అనేకా విధాలుగా మరియు న్యాయస్థానాల వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న వ్యాజ్యముల యొక్క సమాచారాన్ని తిరిగి పొందుటకు వీలు కలిగించును.

  జిల్లా మరియు తాలూకా న్యాయస్థానముల కోసం నేషనల్ జుడిసియల్ డేటా గ్రిడ్ (ఎన్.జె.డి.జి.) లో లభించే సమాచారమునును ఈ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చును. డౌన్ లోడుల సంఖ్య 46,50000(4.56 మిలియన్లు) కంటే ఎక్కువగా వున్నది,ఇదే ఈ అప్లికేషన్ యొక్క ప్రజాదరణ మరియు ప్రయోజనమును నిరూపిస్తున్నది.

  క్యూఆర్ కోడ్(QR code) తో ఈ యాప్ నవీకరణ చెయటం జరిగినది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయుట ద్వారా వినియోగదారులు మొబైల్ ఫోనులో కేసు వివరాలు పొందగలరు. క్యూ.ఆర్ కోడ్ ను ఈ న్యాయస్థానముల వెబ్ సైట్ లో గాని ఈ కోర్టుల సేవల మొబైల్ అప్ప్లికేషన్ నుండి పొందవచ్చును.ఇది ఒక కేసు చరిత్ర లక్షణములు కూడా తెలియజేయును.ఇది ఒక నిర్దిష్ట కేసులో తొలి వాదన జరిగిన సమయము నుండి ప్రస్తుత స్థితి వరకు గల అన్ని సంఘటనలు మరియు ఆదేశములు వీక్షించుటకు వీలు కలిగించును. కేసులలో తీర్పులు మరియు ఆదేశములు చూడడానికి యాప్ లోనే అనుసంధానములు అందించబడతాయి. కేసు తేదీ జాబితా అనే లక్షణo ద్వారా న్యాయవాదుల కేసుల దినవారీ జాబితా (కాస్-లిస్ట్) తెలుసుకొనుటలో సులభతరం అగును.

  • గూగుల్ ప్లే స్టోర్‌ లో పొందండి

  • యాప్ స్టోర్‌ లో పొందండి

  ఇ-కోర్ట్స్ చరవాణి అనువర్తనం యొక్క వాడుక సూచికని
  1. ఆంగ్లము
  2. హిందీ
  3. కన్నడ
  4. మరాఠీ
  5. మలయాళం
  6. నేపాలీ
  7. ఒడియా
  8. పంజాబి
  9. తమిళం
  10. తెలుగు మరియు
  11. గుజరాతి
  భాషలలో పొందడానికి ఇక్కడ నొక్కండి.