Close

    కాల్పనిక న్యాయస్థానము(వర్చువల్ కోర్టు)లు

    vcourt

    కాల్పనిక న్యాయస్థానములు అనేది కక్షిదారులు లేదా న్యాయవాది యొక్క వ్యక్తిగత హాజరు నుండి మినహాయిస్తు మరియు కేసుల పరిష్కారము కాల్పనిక వేదిక పై పరిశ్కారం చేయుటకు ఉద్ధేశించినది. న్యాయస్థానముల వనరులను సమర్ధవంతముగా వినియోగించుట కొరకు మరియు కక్షిదారులను భిన్న వివాదములను పరిష్కరించుటకు ప్రభావవంతమైన మార్గమును ఏర్పరుచుటకు ఈ భావన అభివృద్ది చేయబడినది. ఒక కాల్పనిక వేదిక మీద, కాల్పనిక న్యాయస్థానమును ఒక న్యాయమూర్తిచే నిర్వహింపబడునట్లును ఆయన అధికార పరిధి మొత్తము రాష్ట్రమునకు విస్తరించ వచ్చును మరియు 24X7 నిర్వహించవచ్చును. కక్షిదారుడు గాని న్యాయమూర్తి గాని భౌతికముగా న్యాయస్థానమును సందర్శించకుండగానే సమర్ధవంతమైన న్యాయనిర్ణయం మరియు తీర్పులు చెప్పవచ్చును.సమాచారము కేవలము ఎలక్ట్రానిక్ రూపములో మాత్రమే ఉండడం మాత్రమే కాకుండా శిక్ష విధించుట,ఇంకా జరిమానా చెల్లింపు లేక నష్టపరిహారము చెల్లించుట వంటవి ఆన్ లైన్ లో మాత్రమే పూర్తి అగును. ఎలక్ట్రానిక్ రూపములో సమన్లు అందుకొన్న పిమ్మట నిందితుడు ముందుగానే నేరాన్ని అంగీకరించిన కేసులలో లేక ప్రతివాది ముందుగానే కారణానికి బద్దుడు అయినప్పుడు వాటి పరిష్కారానికి, ఈ కాల్పనిక న్యాయస్థానములను వినియోగించవచ్చును.అటువంటి వ్యాజ్యములలో జరిమానా చెల్లించిన పిమ్మట అవి పరిష్కారింపబడినట్లుగా
    వ్యవహరించవలెను.
    ప్రప్రధమముగా కాల్పనిక న్యాయస్థానముల ద్వారా సమర్ధవంతముగా పరిష్కరింప తగిన వర్గమునకు చెందిన వ్యాజ్యములను తొలుత గుర్తించవలసి యున్నది మరియు పైలట్ ప్రాజెక్టులలో భాగముగా ఈ క్రింది వర్గము కేసులు, కాల్పనిక న్యాయస్థానముల విచారణకు సాధ్యమైనవిగా గుర్తించబడినవి..

    1. మోటార్ వాహన చట్టం క్రింద నేరములు(ట్రాఫిక్ చలనా కేసులు)

    2. సెక్షన్ 206 క్రింద సమన్లు జారీ చేయదగు చిల్లర నేరములు.

    Visit : http://vcourts.gov.in