Close

    జాతీయ న్యాయ సంబంధిత సమాచార కేంద్రము(గ్రిడ్)-(ఎన్.జె.డి.జి)

    photo_2025-01-16_12-02-18

    ఇ- న్యాయస్థానముల(ఇ-కోర్ట్స్) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అమలు చేయబడిన ప్రధాన ప్రాజెక్టు అయిన ఎన్.జె.డి.జి, భారత ప్రభుత్వం యొక్క సులభముగా వ్యాపార నిర్వహణ చొరవ క్రింద ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా గుర్తించబడింది.
    అన్ని జిల్లా న్యాయస్థానములు మరియు తాలూకా న్యాయస్థానములోని పెండింగ్ లో ఉన్న మరియు తీర్మానించబడిన కేసులకు సంబంధించిన వివరముల యొక్క సేకరణ కేంద్రముగా ఇ- న్యాయస్థానము(ఇ– కోర్టు)లలో ఉన్నది.సమర్ధవంతమైన వ్యాజ్యముల నిర్వహణకు మరియు సమర్ధవంతమైన వ్యాజ్యము పరిష్కారమునకు దారి చూపుటకు,ఈ పోర్టల్ అభివృద్ది చేయబడినది.

    పోర్టల్ లో ఎగుమతి(అప్లోడ్) చేయబడిన మరియు పొందుపర్చిన సమాచారన్ని విశదపరచవచ్చును మరియు విశ్లేషించవచ్చును. ఈ క్రింది విధముగా సమాచారమును పొందవచ్చును.

    • వర్గము వారీగా జాబిత
    • సంవత్సరము వారీగా జాబిత
    • రాష్ట్రాల వారీగా జాబిత
    • దేశములోని అన్ని కోర్టుల నెల వారి కేసుల పరిష్కారము యొక్క జాబిత
    • ఒరిజనల్/అప్పీలేట్/వ్యాజ్యముల దశల యొక్క జాబిత
    • కేసుల ఆలస్యమునకు కారణములు.

    దేశములోని అన్ని న్యాయస్థానములలోని దాఖలైన వ్యాజ్యముల యొక్క వివరములు, పరిష్కారము మరియు పెండింగులో ఉన్న వ్యాజ్యముల వివరములు యొక్క ఏకీకృత గణాంకాలను ఎన్.జె.డి.జి. అందిస్తుంది. ఈ గణాంకాలు అన్ని న్యాయస్థానములలో ప్రతిరోజు నవీకరించడం జరుగుతుంది. దాఖలైన మరియు పెండింగులో ఉన్న వ్యాజ్యముల వివరాలను, ఈ వెబ్ సైట్, చూపెట్టడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట వ్యాజ్యము యొక్క సమాచారాన్ని సందర్శకుడు పొందవచ్చును. సివిల్ మరియు క్రిమినల్ అధికార పరిధిని,ఇంకా వాటివoతుల వారీగా అనగా పది సంవత్సరముల పైబడిన కేసుల సమాచారాన్ని,ఇంకా ఐదు నుండి పది సంవత్సరముల మధ్యగల కేసులుగా వాటిని విభజించవచ్చును. జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో అపరిష్కృతంగా ఉన్నవ్యాజ్యముల వివరములు ప్రజా క్షేత్రములో అందుబాటులో వుంచడం జరిగింది.