Close

    ముఖ్యొద్ధేశ్యం & లక్ష్యాలు

    మూల సూత్రములు

    సాంకేతిక పరిజ్ఞానము ‘సాధికారత’ మరియు ‘సమర్ధత’ కు ఉపయోగపడాలి..

    సాంకేతిక పరిజ్ఞానము కేవలం సాంప్రదాయక పద్దతులు మరియు ప్రక్రియలను యాంత్రికం చెయడం గురించి మాత్రమే కాకుండా మార్పునకు ఒక సాధనంగా ఉండాలి. పౌరులందరికి “సాధికారత” మరియు “సమర్ధత”ను కలిగించు ఆయుధంగా ఉండాలి.

    అందరికీ న్యాయం అందుబాటులో ఉండేలా చూచుట..

    ‘సాంకేతికత(డిజిటల్) విభజన’ లేక ఇతర సామాజిక ఆర్ధిక సవాళ్ల నిరాటంక పరిహారం మరియు ఉపశమనం కొరకు, న్యాయ వ్యవస్థను సంప్రదించే మార్గాలను ప్రతీ వ్యక్తికి అందించాలి.

    సమర్ధవంతమైన మరియు ప్రతిస్పందించే న్యాయ వ్యవస్థను నిర్మించడం. .

    న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్వర న్యాయం అందించడమే కాకుండా, న్యాయవ్యవస్థ యొక్క సామర్ధ్యాలను మరియు ప్రభావాన్ని పర్యవేక్షించడానికి మరియు అనుసంధానించడానికి “సామార్ద్య కొలమానాల” పరిణామం ప్రవేశ పెట్టాలి.

    లక్ష్యాలు:

    ఇ-కమిటీ ఈ క్రింది లక్ష్యాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది :

    • దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాలను పరస్పరం అనుసందానించడం.
    • భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క సమాచార సాంకేతిక వ్యవస్థలను ధృడపరచడం.
    • న్యాయ ఉత్పాదకతను గుణాత్మకంగా మరియు పరిమాణాత్మకంగా పెంచడానికి కోర్టులను ప్రోత్సహించడం.
    • న్యాయపంపిణీ వ్యవస్థ అందుబాటులో ఉండేవిధంగా, తక్కువ ఖర్చుతో కూడినదై, పారదర్శకంగా మరియు జవాబుదారీగా ఉండేలా చేయడం.

    దశ (ఫేజ్)-II లక్ష్యాలు:

    • వివిధ సేవా పంపిణీ మార్గాలైన కియోస్కులు, అంతర్జాల పోర్టల్, చరవాణి అనువర్తనం, ఇ-మెయిల్, ఎస్.ఎం.ఎస్. పుల్ మరియు ఎస్.ఎం.ఎస్ పుష్ వంటి ద్వారా వ్యాజ్య సంబంధిత సమాచారాన్ని కక్షిదారులకి సులభతరంగా అందజేయడం.
    • న్యాయవాదుల కోసం వ్యాజ్యముల ప్రణాళిక మరియు వాటి అనుసూచికలను(షెడ్యూలు) తెలియచేయుట.
    • న్యాయాధికారుల కొరకు వ్యాజ్య-భార నిర్వహణతో పాటు వ్యాజ్య నిర్వహణా సహాయకారిగా నిలుచుట.
    • ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు మరియు జిల్లా ప్రధాన న్యామూర్తుల కొరకు పర్యవేక్షక మరియు పర్యవేక్షణ సదుపాయాల కల్పన.
    • ఉన్నత న్యాయస్థానము, న్యాయశాఖ, పరిశోధకులు మరియు విద్యావేత్తల ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా మరియు తాలుకాలలో ఉన్న వ్యాజ్యాల పర్యవేక్షకత మరియు పర్యవేక్షణ.
    • న్యాయ పంపిణీ వ్యవస్థను క్రమపద్ధతిలో మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించడం.