Close

    ఉపోద్ఘాతము

    కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం కోసం భారతదేశంలోని న్యాయరంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని మరియు న్యాయస్థానములలో సాంకేతిక సమాచార వ్యవస్థ్యని అమలు చేయడానికిగాను, జాతీయ మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సి.లాహోటి గారు,ఇ-కమిటీ రాజ్యాంగాన్ని ప్రతిపాదించారు. భారత న్యాయవ్యవస్థ సాంకేతికత(డిజిటల్) యుగానికి తనను తాను సిద్ధం చేసుకోవటానికి, న్యాయపంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానమును,ప్రసార సాధనాలను స్వీకరించడానికి మరియు వర్తింపజేయడానికి,వివిధ కక్షిదారులకు ప్రయోజనం చేకూర్చే జాతీయ విధానానికి, ఈ-కమిటీ దోహదపడుతుంది.

    ఇ-కమిటీ సృష్టించిన సాంకేతికత(డిజిటల్) వేదికలు, నిర్ణీత సమయంలో న్యాయ వ్యవస్థ్య యొక్క సమాచారాన్ని కక్షిదారులకు,న్యాయవాదులకు, ప్రభుత్వ/చట్టాలను అమలు చేయు సంస్థలకు మరియు సాధారణ పౌరులు పొందడానికి వీలు కల్పించాయి. సాంకేతికత(డిజిటల్) సమాచార మూలాలు మరియు పరస్పర ప్రభావశాలి వేదికలు ఈ క్రింది విధముగా వీలు కల్పిస్తాయి.

    • దేశంలోని ఏ న్యాయస్థానములలోనైనా అపరిష్కృతంగా(పెండింగ్) ఉన్న ఒక నిర్ధిష్ట వ్యాజ్యము యొక్క స్థితి మరియు వివరాలను తేలిసుకొనే వీలు కలుగ చేయడం.
    • దేశవ్యాప్తంగా వివిధ న్యాయ సంస్థలలో అపరిష్కృతంగా(పెండింగ్) ఉన్న వ్యాజ్యముల విషయాల నిర్వహణ.
    • త్వరితగతిన ముగించవలసిన (ఫాస్ట్ ట్రాక్) విభాగములకు(కేటగిరి) చెందిన వ్యాజ్యముల యొక్క సమగ్ర సమాచారమును తయారుచేయడం మరియు వినియోగించడం.
    • న్యాయస్థానముల యొక్క వనరులను సమర్ధవంతముగా వినియోగించడం.
    • న్యాయవ్యవస్థ యొక్క సామర్ధ్యాలను మరియు ప్రభావాన్ని పర్యవేక్షించడానికి మరియు అనుసంధానించడానికి సమాచారం యొక్క విశ్లేషణ