ఇ- సేవ కేంద్రము
ప్రాధాన్యతల ప్రాతిపదికన, ఉన్నత న్యాయస్థానములలో మరియు ప్రతి రాష్ట్రములోని,ఒక జిల్లా న్యాయస్థానములలో ఈ సేవా కేంద్రాలు ఎర్పాటు చేయబడినవి.ఇవి కేసు స్థితికి సంబంధించిన సమాచారాన్ని పొందుటకు, తీర్పులు మరియు ఆదేశాల నకలు పొందుటకు న్యాయవాదులకు అనుమతించును.ఇ-దాఖలు సౌలభ్యాన్ని కూడా ఈ కేంద్రాలు అందించును. ఈ కేంద్రాలు సామాన్యులకు ఇక ముఖ్యమైన సోపానములు మరియు న్యాయము పొందు హక్కును సూచిస్తాయి.
ఇ సేవా కేంద్రములలో అందించనున్న సదుపాయములు
ఇ-సేవా కేంద్రముల ద్వారా,ఈ క్రింది సేవలను,తొలుత కక్షిదారులు, న్యాయవాదులకు, విడుదలచేయుబడును:-
- కేసు స్థితి, తదుపరి విచారణ తేదీ మరియు ఇతర వివరముల విచారణను తెలుపును.
- ధృవీకరించబడిన ప్రతుల కొరకు ఆన్-లైన్ దరఖాస్తులను సులభతరం చేయును.
- అస్సలు ప్రతి(హార్డ్ కాపీ) పిటిషన్లను స్కాన్నింగ్ మొదలు ఇ-సంతకము చేర్చుట, సి.ఐ.ఎస్. వరకు వాటిని అప్ లోడ్ మరియు దాఖలు నెంబరును సృష్టించుట ,ఇ – దాఖలు సులభతరము చేయును.
- ఇ-స్టాంప్ పేపర్ల కొనుగోలు/ఇ-చెల్లింపులు ఆన్-లైనులో చేయుటకు సహాయము చేయును.
- ఆధార్,ఆధారిత డిజిటల్ సంతకము కొరకు దరఖాస్తు చేయుటకు మరియు దానిని పొoదుటకు సహాయము అందించును.
- ఆండ్రోయిడ్ మరియు ఐ.ఓ.ఎస్. కొరకు మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయుటకు సహకరించుట మరియు దానిని ప్రచారము చేయుట జరుగును.
- జైలులోని బంధువులను కలుసుకొనుటకు,ఇ-ములాఖత్‌ల నియామకము కొరకు బుకింగ్ సదుపాయము కలిగించును.
- సెలవుల్లో ఉన్న న్యాయమూర్తుల వివరాలను తెల్పుట.
- జిల్లా న్యాయ సహాయ అధికారులు, ఉన్నత న్యాయస్థానము న్యాయసహాయ కమిటీ మరియు సర్వోన్నత న్యాయస్థానము న్యాయ సహాయ కమిటీల నుండి ఉచిత న్యాయసేవను ఎట్లు వినియోగించుకొనవలేనో, ప్రజలకు మార్గదర్శకము చేయవలెను.
- కాల్పనిక న్యాయస్థానము(వర్చువల్ కోర్టు)లలో ట్రాఫిక్ చలాన్లను పరిష్కరించుట, మరియు ట్రాఫిక్ చలాన్లు మరియు ఇతర చిల్లర నేరములను ఆన్ లైనులో పరిష్కరించవలెను.
- ఒక దృశ్య మాద్యమ సమావేశ న్యాయస్థానము(వీడియో కాన్ఫ్-రెన్స్ కోర్టు) ఏర్పాటు, నిర్వహణ పద్ధతిని వివరించే పద్దతి.
- న్యాయ ఆదేశాలు లేక తీర్పుల ప్రతులు, ఇ-మెయిల్, వాట్స్ అప్ లేక లభ్యములో ఉన్న ఎటువంటి మాద్యమములో గాని ఇవ్వవలెను.