న్యాయస్థానాలు మరియు కోవిడ్ – 19: న్యాయ నిపుణతకు పరిష్కారాలను స్వీకరించడం
గౌరవనీయ డాక్టర్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, 17 జూన్ 2020న “ కోర్టులు మరియు కోవిడ్ – 19, న్యాయ నిపుణతకు కోసం పరిష్కారాలను స్వీకరించడం” అనే అంశంపై ప్రపంచ బ్యాంకులో ప్రసంగించారు. సదరు ప్రసంగంలో భారతదేశంలో కోవిడ్–19 మహమ్మారికి న్యాయస్థానాల తక్షణ స్పందనలపై చర్చించారు. భారత సర్వోన్నత న్యాయస్థానము పరిమితి వ్యవధిని నిలిపివేస్తు ఉత్తర్వులు జారీ చేసింది మరియు మధ్యంతర ఉత్తర్వులు మరియు బెయిల్ నిబంధన ఉత్తర్వుల వ్యవధిని పొడిగించింది. మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవటానికి దృశ్య మాద్యమ(వీడియో) సమావేశాలు, అత్యవసర విచారణలకు ప్రామాణిక విధి విధానాలు మరియు ఇ-దాఖలు ద్వారా న్యాయ విచారణలను నిర్వహించడానికి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.
ఇ-కమిటీ సాధించిన మైలురాళ్లను కూడా ఆయన చర్చించారు, వాటిలో ఈ క్రింది అంశములు కూడ ఇమిడి ఉన్నవి :
- ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ఆధారిత కేసు సమాచారం మరియు నిర్వహణ వ్యవస్థ అభివృద్ధి.
- న్యాయస్థానాల ప్రాంగణాలలో ఇ- సేవా కేంద్రాలు నెలకొల్పడం.
- చిన్న ట్రాఫిక్ నేరాలకు సంబంధించిన కాల్పనిక(వర్చువల్) న్యాయస్థానములు చిన్న నేరాలకు సంబంధించిన వ్యాజ్యాలను స్వీకరించడం మరియు ఆన్ లైనులో జరిమానా చెల్లించడం లేదా నేరం ఒప్పుకొనకపోతే కేసును నడిపించుకొనే వీలు కల్పించారు.
- దేశంలోని అన్ని జిల్లా, తాలూకా న్యాయస్థానములు మరియు ఉన్నత న్యాయస్థానములలో పెండిగులో ఉన్న మరియు పరిష్కరించిన కేసులకు సంబంధించిన సమాచారమును జాతీయ సంగ్రహములో నుండుటకు గాను జాతీయ న్యాయస్థాన సమాచార గ్రిడ్ అభివృద్ధి పరచుట.
- సమన్లు అందించడములో ఆలస్యాన్ని పరిష్కరించడానికి సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ఎన్.స్టెప్ తో జి.పి.ఎస్.ను అనుసంధానించుట.
- సర్వోన్నత న్యాయస్థాన తీర్పుల అనువాదం కోసం కృత్రిమ మేధస్సు వాడకం, పునరావృత నమూనాలను కలిగి ఉన్న కేసులను గుర్తించడం, చెక్ బౌన్స్ కేసులను తనిఖీ చేయడం మరియు కేసుల పంథాని ట్రాక్ చేయడం.
ప్రభుత్వం అతి పెద్ద వ్యాజ్యదారుగా ఉందని, ఫలితాలను అంచనా వేయడానికి కృత్రిమ మేధస్సుని ఉపయోగించుకోవచ్చుననియు మరియు విషయ పరిష్కారమునకు చేరుకోవచ్చని ఆయన సూచించారు.
యు.కె. ప్రభుత్వము యొక్క హర్ మెజిస్ట్రీ కోర్టులు మరియు ట్రిబ్యునల్ సర్వీసెస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్, సూసాన్ హుడ్ ను ఉటకింస్తూ ఆయన ఇలా అన్నారు. “మా ప్రక్రియలు, మా సిద్ధాంతాలకంటే పాతవి కానవసరం లేదు. కోర్టులలో భౌతిక హాజరు యొక్క అవసరాన్ని సాంకేతికత(టెక్నాలజీ) మార్చి వేసినది. న్యాయ పరిపాలన పౌరసేవగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. సమగ్ర న్యాయం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపిస్తూ ఆయన ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)ల కార్యక్రమాల పరస్పర(ఇంటర్ ఫేస్) న్యాయం కోసం ప్రాప్యతను ప్రోత్సహించాలని, వినియోగించాలని, వినియోగదారు కేంద్రిత నమూనాను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అనువర్తనాలు మరియు వెబ్ సైట్లను రూపకల్పన చేయడం ద్వారా వీటన్నింటిని సాధించవచ్చని అన్నారు. భవిష్యత్ మార్గం తాదాత్మ్యం, స్థిరత్వం మరియు పారదర్శకత సూత్రాలపై ఆధారపడి ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. దీనికి ప్రభుత్వం, న్యాయవాదులు(బార్), ప్రైవేట్ రంగం మరియు వ్యక్తులతో సహ వివిధ వాటాదారుల మధ్య సంప్రదింపులు అవసరం. విధానాలను రూపొందించడం, డిజిటల్ విభజనను తగ్గించడానికి సమగ్ర అలోచన విధానాన్ని అభివృద్ధి చేయడం, వాటాదారులకు శిక్షణ ఇవ్వడం, దేశంలోని న్యాయస్థానాలలో ప్రామాణికత మరియు ఏక రూపతను కొనసాగించడం మరియు బలమైన సమాచార రక్షణ మరియు సమాచార బదిలి వ్యవస్థను కలిగి ఉండటం అవసరం అని అన్నారు”.