Close

    గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ డి.వై. చంద్రచూడ్, భారత ప్రధాన న్యాయమూర్తి

    2020082939-ouochc3vg48n67zh41untu8p6n80fjw176qvd94ykw
    • హోదా: ప్రధాన పోషకులు మరియు చైర్ పర్సన్

    న్యూ ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఆర్ధికశాస్త్రం ఆనర్స్ తో బి.ఏ., ఢిల్లీ విశ్వవిద్యాలయం నందలి క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్.ఎల్.బి., హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్.ఎల్.ఎం. మరియు ఎస్.జే.డి. పట్టాలను పొందినారు. మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. బొంబాయి ఉన్నత న్యాయస్థానం మరియు భారత సర్వోన్నత న్యాయస్థానములో ఎక్కువగా ప్రాక్టీసు చేసారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా మరియు అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు.

    ముంబాయి విశ్వవిద్యాలయంలో తులనాత్మక రాజ్యాంగ చట్టం యొక్క విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఒక్లహామ యూనివర్సిటీ ఆఫ్ లా నందు విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

    ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, హార్వర్డ్ లా స్కూల్, యేల్ లా స్కూల్ మరియు దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్ విట్వాటర్‌స్రాండ్ లలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ విభాగాలైన మానవ హక్కుల హై కమిషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు మొదలగు వాటిలో ఉపన్యాసకులు.

    మార్చి 29, 2000న బొంబాయి ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసినారు.

    అక్టోబరు 31, 2013న అలహాబాదు ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

    మే 13, 2016న భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

    నవంబరు 9, 2022న భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినారు.