Close

    ఇ-కమిటీ గురించి

    భారతదేశములో న్యాయ వ్యవస్థ అవలంభించిన సమాచార సాంకేతిక వ్యవస్థ్య యొక్క కార్యక్రమాలను ప్రదర్శించే ఈ పోర్టల్ కు ఇ-కమిటీ, భారత సర్వోన్నత న్యాయస్థానము మిమ్మల్ని స్వాగతిస్తొంది. ఇ-కమిటీ అనేది “భారతీయ న్యాయ వ్యవస్థ(ఇండియన్ జ్యుడీషియరీ) ప్రణాళిక” క్రింద సంభావితీకరించబడిన ఇ-న్యాయస్థానముల ప్రాజెక్టును పర్యవేక్షించే బాధ్యతాయుతమైన పాలకమండలి. ఇ-న్యాయస్థానములు(ఇ-కోర్ట్స్) అనేది పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఇది న్యాయ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది మరియు నిధులు సమకూరుస్తుంది. న్యాయస్థానములలో సమాచార సాంకేతిక వ్యవస్థ్యతో దేశ న్యాయ వ్యవస్థను మార్చడం దీని లక్ష్యము.

    పథకము(ప్రాజెక్ట్) యొక్క అవలోకనం

     

    • సమర్థవంతమైన కేంద్రీకృత పౌర సేవలను ఇ-న్యాయస్థానముల(ఇ-కోర్ట్స్) పథకము (ప్రాజెక్ట్) ద్వారా కక్షిదారులకు సేవలను అందించడం.
    • న్యాయస్థానాలలో సమర్థవంతమైన న్యాయపంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయడం,స్థాపించడం మరియు అమలు చేయడం.
    • కక్షిదారులకు సమాచారం యొక్క వివరములను తెలియజెసే ప్రక్రియలను సులభతరం చేయడం.
    • న్యాయవ్యవస్థలో కేసుల పరిష్కారం గుణాత్మకంగా మరియు పరిణామాత్మకంగా పెంచడం,న్యాయపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం,తక్కువ ఖర్చుతో నమ్మదగినదిగాను మరియు పారదర్శకంగాను చేయడం.