Close

  శ్రీ కుల్దీప్ సింగ్ కుష్వా

  Kuldeep Singh Kushwah
  • ఇ-మెయిల్: ms-ecommittee[at]aij[dot]gov[dot]in
  • హోదా: సభ్యుడు – వ్యవస్థలు

  1999 లో కంప్యూటర్ సైన్స్ లో బి.టెక్ పూర్తి చేసారు.2004 లో మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ మరియు 2011 లో జబల్పూర్(ఎం.పి.) నుండి బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్.ఎల్.బి) పూర్తి చేశారు. 6, ఫిబ్రవరి 2017 నుండి 31,సెప్టెంబర్ 2018 వరకు భారత సుప్రీం కోర్టులో ఓ.ఎస్.డి-అఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటి(ఐటి) గా నియమితులైనారు. జూన్,2-2008 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము రిజిస్ట్రార్(ఐటి) గా నియమితులయ్యారు మరియు సెంట్రల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బాధ్యతను కూడా నిర్వహించారు.

  విజయాలు(సాంకేతికపరమైన):

  • 2019 లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానములో ఆన్ లైన్ సర్టిఫైడ్ కాపీ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చెసి అమలు చేసిరి.
  • ఉన్నత న్యాయస్థానము మరియు దిగువ న్యాయస్థానముల సాంకేతికత(డిజిటల్) స్వారూప్యం కోసం అంతర్గతంగా డి.ఎం.ఎస్.ను అభివృద్ది చేయడమే కాకుండా మధ్యప్రదేశ్ లో 2020నుండి అమలు చేయడం జరిగినది.
  • సర్వోన్నత న్యాయస్థానము కంప్యూటీకరణ : 10,మే 2017 న ఐ.సి.ఎం.ఐ.ఎస్ సాఫ్ట్ వేర్ మరియు సర్వోన్నత న్యాయస్థానము యొక్క కొత్త వెబ్ సైట్ ను గౌరవ ప్రధాని శ్రీ.నరేంద్ర మోడి గారు మరియు భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జె.ఎస్.ఖేహార్ గారి సమక్షములో, న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభోత్సవం చేసిరి.
  • 2019 లో మధ్య ప్రదేశ్ లోని ఉన్నత న్యాయస్థానము మరియు సబార్డినేట్ న్యాయస్థానముల కోసం సాఫ్ట్ వేర్ ద్వారా జ్యుడీషియల్ డొమైన్ యొక్క గణాంక విభాగము యొక్క స్వయంచాలికమైన గణాంకాలను తీసుకోవడం జరిగినది.
  • ఇ- న్యాయస్థానముల రుసుముల చెల్లింపు సాఫ్ట్ వేర్ ను ఆర్ధిక శాఖ సాఫ్ట్ వేర్ తో అనగా, టి‌.సి.‌ఎస్ అభివృద్ది చేసిన సైబర్ ట్రెజరీ సాఫ్ట్ వేర్ కు అనుసంధానించడం జరిగినది.
  • సమగ్ర జాబిత(ఇన్వెంటరీ) మరియు ఫిర్యాదు నిర్వహణ సాఫ్ట్ వేర్ ను,మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము మరియు దిగువ న్యాయస్థానముల కోసం సేకరించిన అన్ని కంప్యూటర్‌ పరికరాలు (హార్డ్వేర్) ఉపకరణములకొరకు 2018 లో లో ప్రవేశ పెట్టడం జరిగింది.
  • ఆన్-లైన్ సమాచార హక్కు సాఫ్ట్-వేర్ 2017 లో అభివృద్ది చేయబడింది.
  • సి‌.ఎం‌.ఐ‌.ఎస్ సాఫ్ట్ వేర్ కోసం 2018 లో మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానములో క్లౌడ్ టెక్నాలజీ అమలు చేయబడింది.
  • మధ్య ప్రదేశ్ లోని ఉన్నత న్యాయస్థానము మరియు దిగువ న్యాయస్థానములలో ఇ-హాజరు వ్యవస్థ(ఇ–అటెండెన్స్ సిస్టమ్) అమలు చేయబడింది.
  • మధ్య ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము సాఫ్ట్ వేర్ తో అడ్వకేట్ జనరల్ ఆఫీసు యొక్క అనుసంధానం :- 2016 లో ఉన్నత న్యాయస్థానము యొక్క సంబంధిత స్కాన్/ డిజిటల్ సమాచారాన్ని బదలి చెయడం(డౌన్ లోడ్) లేదా వీక్షించడానికై ప్రవేశించడానికి(లాగిన్ – ఐడి) మరియు పాస్ వర్డ్ ను అడ్వకేట్ జనరల్ ఆఫీసుకు మరియు వినియోగదారులకు అందించబడింది.
  • న్యాయధికారులు/ ఉన్నత న్యాయస్థానములోని ఉద్యోగులు /దిగువ న్యాయస్థానముల ఉద్యోగుల కోసం వ్యక్తిగత సమాచార వ్యవస్థ సాఫ్ట్ వేర్ అభివృద్ది మరియు అమలు.
  • ఇండియన్ లా రిపోర్టర్ మరియు జ్యుడీషియల్ అధికారుల శిక్షణ సంస్థ యొక్క జర్నల్ సార్ట్ వేర్ అభివృద్ధి మరియు అమలు.
  • ఉన్నత న్యాయస్థానముల కోసం సి‌.ఎం‌.ఐ‌.ఎస్(CMIS) సాఫ్ట్ వేర్ అభివృద్ది మరియు అమలు :-ఈ‌ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ భావన పై ఆధారపడి ఉంటుంది, దీని ద్వారా ప్రతి మానవ వనరులు, మౌలిక సదుపాయాలు,సమయ నిర్వహణ మొదలైన వాటిని ఉన్నత న్యాయస్థానము యొక్క భవిష్యత్తు అవకాశాల అవసరాన్ని తీర్చడానికి ఉపయోగించుకుంటుంది. న్యాయస్థానము సిబ్బంది జవాబు దారిగా, భాధ్యతాయుతంగా ఉండడమే కాకుండా కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా అతనికి కేటాయించిన పని యొక్క ఏకరీతి కేటాయింపును పూర్తి చేస్తారు. ఈ సాఫ్ట్ వేర్ రోజు వారి ప్రాతిపదికన కాల్పనిక పని విభజన(వర్చువల్ వర్క్ కటౌట్) ను రూపొందించడానికి అభివృద్ది చేయబడినది. ఇది వారి పని భారాన్ని తగ్గించును మరియు వారి సామర్ధ్య స్థాయిని పెంచును. ఇ –మెమోను డిజిటల్ సంతకము చేసి సంబంధిత వినియోగదారులకు వారి ఇ-మెయిల్ ఐడిలలో పంపవచ్చు. స్వయంచాలకంగా ఉత్పత్తి చేయబడిన కంప్యూటర్ సాఫ్ట్ వెర్ వ్యవస్థ కాలక్రమానుసారం కేసుల జాబితాను నిర్ధారిస్తుంది మరియు పేర్కొన్న ప్రాధాన్యతను బట్టి 2014 లో రోజు వారీ ప్రాతిపదికన న్యాయమూర్తుల మధ్య పని భారం సమానంగా పంపిణీ చేయబడుతుంది.
  • ఉన్నత న్యాయస్థానము,దిగువ న్యాయస్థానములు మరియు ఫ్యామిలి న్యాయస్థానముల కొరకు సి.‌ఎం‌.ఎస్(CMS) ద్విభాషా వెబ్-సైట్ ను మధ్యప్రదేశ్ లో2014లో అభివృద్ధి చేయడం జరిగింది.
  • వివిధ పౌర సేవల అనువర్తనాల(యాప్ లు) కోసం అంతర్గత సంక్షిప్త సందేశము,ఇ-మెయిల్ వ్యవస్థ అభివృద్ధి మరియు అమలు జరిగినది.
  • 2013లో మధ్యప్రదేశ్ లోని ఉన్నత న్యాయస్థానము, దిగువ న్యాయస్థానములను మరియు ఫ్యామిలి న్యాయస్థానముల కొరకు అంతర్గత ప్రక్రియ నిర్వహణ సాఫ్ట్ వేర్ అభివృద్ధి, అమలు జరిగినది.

  విజయాలు (పరిపాలన):

  • డైరెక్టర్, ఎం‌పి‌ఎస్‌జేఏ అండ్ రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వర్క్స్) తో సంప్రదించి ఐ‌టి కి సంబంధించిన 14 మరియు 15 వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన పని చేపట్టుట.
  • దృశ్య మాద్యమ (వీడియో) నిఘా, సాంకేతిక, మానవ వనరులు, డిజిటలైజేషన్ మరియు లోకల్ ఏరియా నెట్ వర్క్స్ వాటి సంబంధిత ఒప్పందం కొరకు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానము మరియు దిగువ న్యాయస్థానములకు సంబంధించిన టెండర్లు (ఇ- టెండర్) విధానాని అమలు పరచుట.
  • సాంకేతిక మరియు ఇతర సంబంధిత మానవ వనరుల యొక్క ఔట్ సోర్సింగ్ కు సంబంధించిన పని.
  • అన్ని జిల్లా మరియు దిగువ న్యాయస్థానముల సముదాయలు, జిల్లా ఆసుపత్రులు మరియు సంబంధిత జైళ్ళలో దృశ్య మాద్యమ (వీడియో కాన్ఫరెన్సింగ్) సధుపాయాన్ని ఏర్పాటు చేయడం.మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానములో జబల్పూర్ ప్రధాన బెంచ్ మరియు గ్వాలియర్ వద్ధ గల బెంచ్ లో దృశ్య మాద్యమ(వీడియో కాన్ఫరెన్సింగ్) సదుపాయాలు కల్పించడం. రాష్ట్ర జుడీష్యల్ అకాడెమిలు, జిల్లా న్యాయసేవ అధికారుల కంప్యూటికరణ,డిజిటలైజేషన్ మొదలైన వాటి ద్వారా కోర్టు నిర్వహణ వ్యవస్థను నిర్వహించడం.
  • ఉన్నత న్యాయస్థానముల మరియు దిగువ న్యాయస్థానముల యొక్క వివిధ బడ్జెట్ హెడ్స్ క్రింద బడ్జెట్ అంచనాలను సాంకేతిక సమాచారము(ఐ‌టి) మరియు పరికరాలు కొరకు తయారు చేయుట.
  • న్యాయ వ్యవస్థ అధికారులు, న్యాయవాదులు మరియు న్యాయస్థానాల సిబ్బంది కొరకు రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ సమన్వయంతో ఏడాది పొడవున వివిధ సాంకేతిక సమాచారము(ఐ‌టి) సoబంధమైన శిక్షణా తరగతులు నిర్వహించారు.