Close

    డాక్టర్ జస్టిస్ డి.వై .చంద్రచూడ్, న్యాయమూర్తి, భారత సర్వోన్నత న్యాయస్థానము

    Dr Justice Dhananjaya Y Chandrachud
    • హోదా: అధ్యక్షుడు

    న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టేఫెన్స్ కాలేజ్ నుండి బి.‌ఏ.ఎకనామిక్స్ లో హానర్స్,ఢిల్లీ విశ్వ విద్యాలయం యొక్క క్యాంపస్ లా సెంటర్ నుండి ఎల్‌.ఎల్‌.బి డిగ్రీ మరియు ఎస్.జె.డి హార్వర్డ్ లా స్కూల్ యూ.ఎస్.ఎ నుండి ఎల్.ఎల్.ఎం. డిగ్రీని పొందిరి. మహారాష్ట్రలోని బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా చేరారు. ప్రధానంగా బొంబాయి ఉన్నత న్యాయస్థానముమరియు సర్వోన్నత న్యాయస్థానములలో ప్రాక్టీస్ చేశారు. 1998లో భారత సీనియర్ అడ్వకేట్ మరియు అదనపు సొలిసెటర్ జనరల్ గా నియమించబడ్డారు.

    • బొంబాయి ఉన్నత న్యాయస్థానము ధర్మాసనముకు 29,మార్చి,2000న న్యాయమూర్తిగా నియమింపబడ్డారు.మహారాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేశారు.
    • అలహాబాద్ ఉన్నత న్యాయస్థానము ప్రధాన న్యాయమూర్తిగా,31,అక్టోబర్,2013 నాడు ప్రమాణ స్వీకారం చేశారు.
    • భారత సర్వోన్నత న్యాయస్థానమున్యాయమూర్తిగా, 13,మే,2016 న పదోన్నతి పొందిరి.
    • ముంబాయి విశ్వ విశ్వవిద్యాలయములో ‘తులనాత్మక రాజ్యాంగ చట్టం’ యొక్క సందర్శకాచార్యునిగా(విజిటింగ్ ప్రొఫెసర్) మరియు అమెరికాలోని ఓక్లహోమా యునివర్సిటి, స్కూల్ ఆఫ్ లా, లో సందర్శకాచార్యునిగా(విజిటింగ్ ప్రొఫెసర్) సేవలందించిరి.
    • ఆస్ట్రేలియన్ జాతియ విశ్వవిద్యాలయము , హార్వర్డ్ లా స్కూల్, యేల్ లా స్కూల్ మరియు దక్షిణాఫ్రికా లోని విట్వాటర్స్ రాండ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితితో సహ ఐక్యరాజ్యసమితి మానవ హక్కులపై హైకమిషన్,అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకులతో సహా ఐక్యరాజ్యసమితి సంస్థలు నిర్వహించిన సమావేశాలలో స్పీకర్ గా పాల్గొనిరి.